గుంటూరు మలినేని ఇంజినీరింగ్ విద్యార్థిని సూసైడ్… ర్యాగింగ్ చేసి బలైందా…

వివరాల్లోకి వెళితే… మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో మొన్న ఆగస్టు 3వ తేదీన ర్యాగింగ్ విషయమై జూనియర్లు, సీనియర్లు డిస్కషన్స్ జరిగాయి. ఈ క్రమంలో సునీత తన సెల్ ఫోనులో ఆ డిస్కషన్స్ వివరాలను రికార్డ్ చేసింది. మరోవైపు తమను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం సీనియర్లను పిలిపించింది. ఆ క్రమంలో సునీత సెల్ ఫోనులో సంబంధిత ఘటనలను రికార్డు చేసిందని తెలుపడంతో యాజమాన్యం సునీతను పిలిపించి, సెల్ ఫోన్ ఎలా వచ్చిందంటూ నిలదీసింది.
ఆ సెల్ ఫోనును తీసుకురావాల్సిందిగా ఒత్తిడి చేయడం జరిగినట్లు చెపుతున్నారు. దీనితో తనపై ర్యాగింగ్ నేపధ్యంలో చర్య తీసుకుంటారని భయపడ్డ సునీత పరుగెత్తుకుంటూ నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. కాగా పూర్తి వివరాలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ చెప్పారు. అసలు సీనియర్లు, జూనియర్లను ఒకే గదిలో ఎందుకు ఉంచుతున్నారంటూ ప్రశ్నించారు. ర్యాగింగ్ విషయంలో కళాశాల ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తమకు తెలియజేయాలని ఆదేశించారు