గురజాడ గ్రంథాలయానికి ఎసి సదుపాయం

విజయనగరం, జూన్‌ 28 : గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఎసి సదుపాయం కల్పించాలని గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను అధ్యక్షులు రొంగలి పోతన్న ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాక దాదాపు 5 లక్షల ఖర్చుతో వివిధ శాఖ గ్రంథాలయాలకు ఫర్నీచర్‌, ఎసి సదుపాయం కోసం 2 లక్షల రూపాయిలు ఖర్చు చేస్తామన్నారు. ఇవేగాక లక్ష రూపాయిల ఖర్చుతో ఇన్‌వెర్టర్లు ఏర్పాటు చేసి చదువరులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. రూ.2లక్షలతో స్టేషనరీ , మరో 2 లక్షలతోఆధునిక పరికరాల కొనుగోలు చేపడతామని, మొత్తం 1.83 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో డిపిఆర్‌ఒ రమేష్‌, గ్రంథాలయ కార్యదర్శి విద్యాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.