గురుకుల్‌ ట్రస్టు భూముల వివాదాల పరిష్కారం కోసం కమిటీ

హైదరాబాద్‌: నగర శివార్లోని గురుకుల్‌ ట్రస్‌& భూముల అక్రమణల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెలువరించింది. వివాదాల్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగించాలని సూచిందచింది. దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో గురుకుల్‌ ట్రస్టుకు వేరే  చోట భూములు కొనుగోలు చేసి అప్పగించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకోవారిని అక్కడినుంచి ఖాళీ చేయించి..ఆ భూములను ట్రస్టుకు అప్పగించాలని ఆదేశాలు  జారీ చేసింది.