గృహనిర్మాణ పథకం నిధులు రూ.27.21 లక్షల దుర్వినియోగం

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం నిధులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున దుర్వినియోగమయ్యాయి. సిబ్బంది అవినీతి కారణంగా రూ.27.21లక్షలు దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌ గృహనిర్మాణ పథకం సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. నలుగురు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లను విధుల నుంచి తొలంగించారు. ఇద్దరు డిప్యూటీ ఈఈలు, మరో ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.