గృహప్రవేశ ఆహ్వానం దర్శకుడు రాఘవేంద్రరావు
జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి.6తన అభిమాని కోరిక మేరకు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన దర్శకేంద్రుడు కే .రాఘవేందర్ రావు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు రాఘవేందర్ రావు తన అభిమాని కోరిక మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నల్లమల్ల కృష్ణ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చినా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుని తమ అభిమాని తాను నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి ఆహ్వానించగా అభిమాని కోరికను మన్నించి అతని ఇంటి గృహప్రవేశా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ అభిమాని తన అభిమాన దర్శకుడికి శాలువతో పూలమాలతో సత్కరించాడు. తమ అభిమాన దర్శకుడు కే రాఘవేంద్రరావు తన కోరికను మన్నించి తన ఇంటి గృహప్రవేశానికి విచేసినందుకు చాలా సంతోషంగా ఉందని మర్చిపోలేని లైఫ్ టైం మెమరబుల్ఈమధుర జ్ఞాపకం ఎన్నటికీ మరువలేనని అన్నాడు.