గొల్కోండ ఎక్స్‌ప్రెస్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌

నెక్కొండ, ఫిబ్రవరి 15 జ‌నంసాక్షి : వరంగల్‌ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజి కా గా, ప్రయాణికుల అప్రమత్తతో పెనుప్రమాదం తప్పింది. పెద్దకొర్పోలు సమీపంలో రైలు వెనుక వైపు ఉన్న రెండు బోగీల నుంచి గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ వాసనతో భయాందోళనకు గురైన ప్రయా ణికులు చైన్‌ లాగి రైలును నిలిపేశారు. రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ప్రయాణికుడు ఒకరు తీసుకెళుతున్న మూడు కేజీల గ్యాస్‌ సి లిండర్‌ లీకేజీ కావడంతో గ్యాస్‌ వాసన వ్యాపించినట్లు తెలిసింది. ప్రయాణికులు ఆందోళన చెందుతుండగానే సదరు ప్రయాణికుడు సిలిండర్‌తో సహా జారుకున్నాడు.