గ్రామం లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి
జనం సాక్షి /కొల్చారం మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు మంగళవారం అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కులమతాలకతీతంగా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ సంబరాల్లో మునిగిపోయారు. ఇదే రోజు మండలం బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు, కొల్చారం జెడ్పిటిసి ముత్యం గారి మేఘమాల భర్త ముత్యం గారి సంతోష్ కుమార్ జన్మదినం కావడంతో స్థానిక ముదిరాజ్ సంఘ భవనంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే కొల్చారంలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి తన సొంత ఖర్చులతో బోర్ వేయించి మంగళవారం తన జన్మదినం పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టి మోటార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నేరెళ్ల చంటయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆశన్న గారి ఆంజనేయులు, కుంటోల్ల మల్లయ్య, చింతల బాలరాజ్, యాదగిరి, జేటబాయిన శ్రీశైలం, అరకెళ్ల నాగయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్చారంలో విఎస్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులంతా హోలీ సంబరాల్లో మునిగి తేలారు.