గ్రామపంచాయతీ సాధారణ సమావేశం

కొడకండ్ల, మార్చి01(జనం సాక్షి) కొడకండ్ల గ్రామపంచాయతీ సాధారణసమావేశoసర్పంచ్ పసునూరి మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో 4 లేను రోడ్డు , డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినందుకు,సి సి రోడ్లు డ్రైనెజి ,మెటల్ రోడ్లకు నిధులు కేటాయించినం దుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు గ్రామపంచాయతీ,కొడకండ్ల గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తేలిపారు.రెండు నెలల్లో నూతన గ్రామపంచాయతీ, లైబ్రరీ భవనం మంత్రితో ప్రారంభిస్తామని, ఎండాకాలం సందర్బంగా నీరు పొదుపుగా వాడుకొని వృధాగా పోకుండా చూసుకోవాలని, ఇంటిపన్ను, నల్లా పన్ను సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో ఉప సర్పంచ్ రమేష్,కార్యదర్శి శ్రీనివాస్ వార్డ్ సభ్యులు రాములు,విరస్వామి,హరీష్,సరిత, శారదా తదితరులు పాల్గొన్నారు.