గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ లదే – కేటీఆర్..
హైదరాబాద్ : గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ లదేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో స్వచ్ఛ తెలంగాణపై వగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని సర్పంచ్..కార్యదర్శులకు నిర్మల్ గ్రామీణ పురస్కారాలు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామన్నారు. పన్ను వసూలుతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు.