గ్రిడ్ల వైఫల్యంపై విచారణ: వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం విద్యుత్తు గ్రిడ్ల వైఫల్యంపై విచారణ నిర్వహిస్తామని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. బుధవారం ఆయన విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంవగా మాట్లాడుతూ ఉత్తర, ఈశాన్య గ్రిడ్‌లు కుప్పకూలడంతో రూ కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు తెలియజేశారు. గ్రిడ్ల వైఫల్యంపై కమిటీని నియమించి విచారణ నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం మూడు గ్రిడ్ల పరిస్థితి సాధరణ స్థితిలో ఉందన్నారు. ఈనెల 6న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.