గ్రూప్‌ – 1 మెయిన్స్‌ పరీక్షలు

హైదరాబాద్‌: రేపటినుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా 314 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌ పరీక్షలకు 16,867 మందిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. కటాఫ్‌ మార్కుల వివాదంతో ట్రైబ్యునల్‌ ద్వారా అనుమతి పొందిన 185 మంది సైతం ఇందులో ఉన్నారు. వీరి ఫలితాలు మాత్రం తుది విచారణ తర్వాతే విడుదల చేస్తారు. గ్రూప్‌-1 మెయిన్స్‌లో తొలిసారి ప్రయోగాత్మకంగా ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థి పూర్తి సమాచారాన్ని ముద్రిస్తున్నారు. ఈ విధానం వల్ల పారదర్శకతతో పాటు అభ్యర్థి తప్పులు చేసే అవకాశం ఉందరని ఏపీపీఎస్సీ భావిస్తోంది.