గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కడప, జూలై 20 : జిల్లాలో ఈ నెల 21, 22 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం నాడు ప్రకటనలో తెలిపారు. గ్రూప్‌-2 పరీక్షలు కడప, సికెదిన్నె, చెన్నూరు, రాజంపేట, ప్రొద్దుటూరులలో వెరసి 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని 21వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆబ్జెక్టివ్‌ విధానంలో వ్రాత పరీక్ష, 22వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు గ్రూప్‌-2 పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాలలో నికిప్రింటు, ఎలక్ట్రానిక్‌ మీడియా వారికి అనుమతి లేదని ఏపిపిఎస్సి సెక్రటరి సూచనలు ఇచ్చారని కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.