గ్రూప్‌-2 పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌, జూలై 22 : జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన ఏపిపిఎస్‌ గ్రూప్‌-2 పరీక్షలకు మొత్తం 5136 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, 4000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజర్‌ కాగా, 1136 మంది గైర్హాజరైనట్టు జిల్లా కలెక్టర్‌ ఎ.అశోక్‌ తెలిపారు. సాయంత్రం జరిగిన పరీక్షకు 3977 మంది హాజర్‌ కాగా వారిలో 1159 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ గౌతమి జూనియర్‌ కళాశాల, లిటిల్‌ స్టార్‌ హైస్కూల్‌, సిబిఆర్‌ మోడల్‌ స్కూళ్లలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు.