ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు :
శామీర్ పేట్, జనం సాక్షి :
మంగళవారం శామీర్ పేట లో భారత రత్న భీం రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా 1వార్డు సభ్యులు మాధవి రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతు.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దెశానికి చేసిన సెవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల కే కాక ప్రతి ఒక్కరికి ఆయన చూపిన దిశా నిర్దేశం ఒక గీటురాయి వంటిదని, ఇటువంటి మహామనిషి మన దేశంలో పుట్టడం భారత జాతి కి గర్వకారణమని అన్నారు . ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలు పాటించి భారతావని ప్రతిష్టను మరింతగా ఇనుమడింప జేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ తో పాటు వార్డు సభ్యులు శ్రీకాంత్ గౌడ్, మురళి, ఉప్పలయ్య,నాయకులు రవి,శివ, రాజు, డాక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
6ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు

తాజావార్తలు