ఘనంగా తెలంగాణా ధూంధాం ఉత్సవాలు

హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆటటోరియంలో ఘనంగా నిర్వహించారు. రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో తెలంగాణ పది జిల్లాల కళాకారులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తెలంగాణకు ప్రధన శత్రువుగా చూడాలని ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. కవులు, కళాకారులు రచయిలు తెలంగాణకు అనుకూలంగా, రాజకీయ పార్టీలకు ప్రతిపక్షంగా వ్యవహిరించాలని గద్దర్‌ సూచించారు. విమలక్కపై కేసులు ఎత్తివేయాలని. విద్యార్థి , యువత పై పెట్టిన కేసులను ఉప సంహరించుకోవాలని తెలంగాణ ధూంధాం తీర్మానం చేసింది. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని తెలంగాణ ధూంధాం నిర్ణయించింది.