ఘనంగా తెలంగాణ మహిళా ధూం…ధాం..!

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ మహిళల ధూం…ధాం…! ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటాపాటలతో ధూం…ధాం కొనసాగింది. ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో వచ్చిన మహిళలు, మద్దతుదారులు పాల్గోన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబ సభ్యులు వేదికపై కంటతడిపెట్టారు. తెలంగాణ వచ్చేదాకా ఆటపాటలతో ఉద్యమాన్ని ముందుకు సాగిస్తామని విమలక్క స్పష్టం వ్యక్తం చేశారు.

తాజావార్తలు