ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
బోయిన్ పల్లి మార్చ్ 29 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు మాడిశెట్టి జనార్ధన్ అధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జి జంగం అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని 41వ ఆవిర్భావ దినోత్సవం జండా ఆవిష్కరణ చేసి పండ్ల పంపిణీ చేసారు. అనంతరం ఇంచార్జీ జంగం అంజయ్య తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు అంతే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ లోకసభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన గణతకూడ ఆయనకే దక్కడం విశేషం. కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ రూపు దిద్దారని ఆయన కొనియాడారు. తెలుగు దేశం పాలనలోనే అణగారిన వర్గాలకు కులాలకు రాజకీయంగా సామాజికంగా గుర్తింపు లభించిందని బడుగుల బతుకులు బాగుపడ్డాయన్నారు.