ఘనంగా పీజేఆర్‌ జయంతి

హైదరాబాద్‌: సీఎల్పీ మాజీ నేత పి. జనార్దన్‌రెడ్డి 65వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని పీజేఆర్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర విపత్తుల నిర్వహణ ఉపాధ్యక్షుడు మర్రిశశిధర్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు. బడుగు, బలహాన వర్గాల అభ్యున్నతికి పీజేఆర్‌ చేసిన సేవలను నేతలు కొనియాడారు.