ఘనంగా బిజెపి మండల అధ్యక్షుడు అనిల్ జన్మదిన వేడుకలు..


శంకరపట్నం: జనం సాక్షి మార్చి 14
శంకరపట్నం మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు, కేశవపట్నం ఎంపీటీసీ 2 అనిల్ జన్మదిన వేడుకలను, మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి పార్టీ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిల్ హాజరై కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి దసారాపు నరేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జపాల్, మండల ఉపాధ్యక్షులు వీరా అర్జున్, మండల్ నాయకులు రమణారెడ్డి శివారెడ్డి, రాజిరెడ్డి. అశోక్, శ్రీకాంత్ , అనిల్, సాయి ,ప్రకాష్ ,సాయి ప్రణయ్, భరద్వాజ్ ,ఆదర్శ యూత్ సభ్యులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.