ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతిని పురస్కరించుకుని శనివారం మండలంలోని ఆందనలపాడు గ్రామంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ మండలాధ్యక్షుడు బానోతు రాము నేతృత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి,రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే దేశ ప్రధాని పదవిని చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిన మహనీయుడు అని కొనియాడారు.రాజీవ్ గాంధీ నేటికీ సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం రివల్యూషన్ పితామహునిగా కీర్తించబడుతున్నారని ఆయన తెలిపారు.ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదిస్తూ, ప్రజాస్వామ్యంలో యువతకు పెద్దపీట వేశారన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు గ్రామ పార్టీ అధ్యక్షుడు గోవింద్ వెంకన్న, ఉపాధ్యక్షుడు ఆంగోత్ నాగేశ్వరరావు,గొర్రె నాగేశ్వరావు,యూత్ ప్రెసిడెంట్ దాసరి మధు, సీనియర్ నాయకులు శ్రీను,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.