ఘనంగా లష్కర్ బోనాలు
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) :
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ వెంట నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డి.శ్రీనివాస్, కే.కేశవరావులు ఉన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కేసీఆర్ వెంట నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డి.శ్రీనివాస్, కే.కేశవరావులు ఉన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ¬మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ప్రొ.కోదండరాం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు విరివిగా కురిసి… రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.