ఘనంగా వేణుగోపాలాచారి తనయుడి వివాహం

సిఎం కెసిఆర్‌, మంత్రుల రాక

హైదరాబాద్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి తనయుడు సాయికృష్ణ వివాహం డాక్టర్‌ నృత్యతో ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా బుధవారం ఉదయం 11 గంటలకు జంట వివాహ బంధంతో ఒక్కటయ్యింది. కొంపల్లి వెంకటేశ్వర గార్డెన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సిఎం కెసిఆర్‌, ఎంపి కవితలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. లాగే రాజకీయ,సినీ ప్రముఖులు, అధికారులు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. అలాగే అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖలకు ఆహ్వానం అందింది. మాజీ గవర్నర్‌, సిఎం అయిన రోశయ్య, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్‌ రావు, జోగురామన్న, ఎంపిలు నగేశ్‌,సినీ ప్రముఖులు తనిఖెళ్ల భరణి,పలువురు ఐఎఎస్‌ అధికారులు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఆహుతలకు వేణుగోపాలాచారి ఆయన సతీమణి రేవతీ వేణుగోపాల్‌ సాదర స్వాగతం పలికారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారగా తరలి వచ్చారు.

———–