ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి

హైదరాబాద్‌:భాజపా వ్యవస్థాపక అద్యక్షుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్దంతిని అపార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహించింది.హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ నాయకులు పాల్గోన్నారు.ఈ సందర్బంగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.