ఘోరం.. లోయలో బస్సు పడి 21 మంది మృతి..!

  • 40 మంది వరకు గాయాలు
  • జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

”ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ము-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలో పడిపోయింది” అని వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయని చెప్పారు. గాయపడిన వారిని అఖ్నూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ”ఈ ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.