చంచల్‌ గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:ఓఎంసీ కేసులో నిందితులను విచారించడానికి ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు ఈ ఉదయం చేరుకున్నారు.ఓఎంసీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌,ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మీలను ఈరోజు ఈడీ అదికారులు ప్రశ్నించనున్నారు.ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిందితులను విచారించన్నట్లు సమాచారం.మరోవైపు అక్రమాస్తుల కేసులో జగన్‌ తోపాటు నిమ్మగడ్డ ప్రసాద్‌,బ్రహ్మనందరెడ్డి బీపీ ఆచార్యలను 25న ఈడీ ప్రశ్నించనుంది.