చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ పొడవు శ్రీనివాసులు

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ పొడవు శ్రీనివాసులుగోపాల్ పేట్ జనం సాక్షి మార్చి (3): గోపాల్పేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో 1991 – 92 బ్యాచ్ పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు చదువుకున్న గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు భవిష్యత్ లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు మతిన్, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు