చాకలి ఐలమ్మ 127 వ జయంతోత్సవాలు
నాంపల్లి సెప్టెంబర్ 26 (జనం సాక్షి ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతోత్సవాలు నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా లో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాంపల్లి తాసిల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు మహిళలు విరోచితంగా పోరాడడంలో కీలకపాత్ర పోషించి తెలంగాణ సాయుధ పోరాటానికి ఉతేజాన్ని నింపిన మహిళ చాకలి ఐలమ్మ గారు దొరలను భూస్వాములను గుర్తుప సంఘాలు పెట్టి తరిమిన చరిత్ర ఐలమ్మది అని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం ప్రపంచం చరిత్ర పుటల్లో ఎక్కింది అని ఆయన కొని ఆడారు. రజాకార్లను విసునూరు రామచంద్రారెడ్డి దొరలను గడగడలాడించిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు.ఆమె స్ఫూర్తి ఈ తరం యువతీ యువకులు చదివి ఆమె అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షుడు కోరె సాయిరాం, రజక సంఘం మండల నాయకులు నాంపల్లి సత్తయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు నారాయణ, నాంపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీ సత్తార్ ,ఎ.వెంకటేశ్వర్లు. రాజు, కే.శ్రీకాంత్, నాంపల్లి గిరిబాబు,వి సుధాకర్, ఈద శేఖర్,నాంపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.