చిన్నచెల్మడలో పోషణ పక్షోత్సవాలు
మునిపల్లి, మార్చ్ 23, జనంసాక్షి : ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలో గురువారం అంగన్వాడీ టీచర్ మీనాక్షి ఆధ్వర్యంలో చిరు ధాన్యా సంవత్సరం, పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పర్యవేక్షకురా బి. శైలజ హాజరై మాట్లాడారు. మార్చి20వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చేకూరే ప్రయోజనాలపై క్లుప్తంగా వివరించారు. రాగులు, ఉలవలు, కొర్రలు, సామాలు, అండు కొర్రలు, జొన్నలు, ఉదలు తదితర చిరు ధాన్యాల ప్రాముఖ్యతను తెలిపారు. అలాగే కూరగాయాలను, ఆకుకూరలను పెంచుకోవడం ద్వారా గర్భిణులకు, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలకు ఉపయోగం కలుగుతుందని వివరించారు. అనంతరం చేతులు శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మీనాక్షి, ఆశా వర్కర్ అనిత, గర్బిణీ, బాలింతలు అంజమ్మ, పెంటమ్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.