చిమ్మపూడి గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మధ్య ఘర్షణ

రఘునాథ పాలెం డిసెంబర్ 09(జనం సాక్షి) మండల
చిమ్మపూడి లో రాజకీయ ఘర్షణతో గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీ వల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల విషయమై గ్రామంలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ జరిగింది ఓటర్లకు నగదు పంచినా మా కన్నా కేవలం 54 ఓట్లే అధికంగా వచ్చాయంటూ గ్రామస్థులు ఉన్న ఓ సామాజిక మాధ్యమ గ్రూపులో ఓ ప్రధాన పార్టీకి చెందిన పొన్నం యాదగిరి పోస్టు పెట్టారు దీంతో మరో పార్టీవారు అతని ఇంటి పై గురువారం రాత్రి దాడికి యత్నించారు దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరువర్గా లను పంపించి వేశారు. ఈ సంఘటనపై పొన్నం యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్డు సభ్యుడు గుండ్ల ముత్తయ్య, కాంపాటి రవి ఏపూరి మధు మోదుగు కిరణ్ పేరెళ్ల అశోక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టరు శ్రీధర్ తెలిపారు.