చెట్టును ఢీకొన్న బస్సు.. కండెక్టర్‌ మృతి

చించూరు : విజయవాడ నుంచి కుంట వస్తున్న ఇబ్రహింపట్నం ఆర్టీసీ డీపో బస్సు  ఖమ్మం జిల్లా చించూరు మండలం బొడ్డుగూడెం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది.ఈ ప్రమాదంలో కండెక్టర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.