చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌ భేటీ అయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో డీఏంకే స్థిరమైన భాగస్వామి అని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రణబ్‌ అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, శివసేనల మద్ధతు కూడా తనకుందని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతాలకు తావు లేదని ఇది మెజారిటీకి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.