చేనేతకార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
అమలాపురం:జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బండారులంక అమలాపురం,బట్నవల్లి ప్రాంతాల్లో పర్యటించారు.బండారులంకలో చేనేతకార్మికుల కుటుంబాలను పరామర్శించి,స్థానిక పరిస్థితులను చేనేత కార్మికును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ బాట కార్యక్రమంలో బాగంగా బండారు లంకలో ఏర్పాటుచేసిన చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా,700మెగావాట్ల విద్యుత్ కొనుగొలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.జాతీయ ఉపాది హామీ పథకంలో చేనేత రంగాన్ని చేర్చేందుకు కేంద్రంలతో చర్చిస్తామని ఆయన చెప్పారు.