చేనేతను చేయూతనివ్వాలి
నాబార్డ్ గ్రామీణ మేళను ప్రారంభం….
నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా
మిర్యాలగూడ, జనం సాక్షి.
చేనేత వస్త్రాలను ఆదరించాలని, చేనేతను చేయూతనివ్వాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల సమిడి వీరారెడ్డి కళ్యాణ మండపంలో కళాభారతి చేనేత హస్తకళ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నాబార్డ్ గ్రామీణ మేళను అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్పత్తిదారులచే నేరుగా గ్రామీణ మేళలో విక్రయాలు జరుగుతున్నాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామీణ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ పెండాల శ్రీనివాస్ లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ తూడి శ్రామిక్, డిఆర్డిఏడిపిఎంరామలింగయ్య,
కళాభారతి చేనేత హస్తకళ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నిర్వాహకులు జల్లా సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.