చేనేత సంక్షేమం కోసం కృషి : మంత్రి ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌళీశాఖ మంత్రి జి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను నారాయణగూడలోని ఆప్కో భవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఆప్కో ద్వారా వివిధ పధకాలను ప్రవేశపెడ్తున్నామని చెప్పారు. మూడు ప్రభుత్వ శాఖల నుంచి రూ. 45.7 కోట్ల విలువైన  వస్త్రాల సరఫరా నిమిత్తం ఇండెంట్స్‌ పొందినట్లు తెలియజేవారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాలను విస్తృతపరచి మరింత పెంపొందించేందుకు ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఈ నెల 13లోగా ప్రారంభిస్తామని వెల్లడించారు.