చైనాలోని రెస్టారెంట్‌లో పేలుడు.. 14 మంది మృతి

బీజింగ్‌: ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి  చెందగా.. 47 మంది గాయాలపాలయ్యాయి. జిన్‌జాంగ్‌ నగరంలోని జియాంగ్‌యంగ్‌ రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి రెస్టారెంట్‌ భవనంతోపాటు పక్కనున్న దుకాణాల కిటికీలు ధ్వంసమయ్యాయి. గ్యాస్‌ లీక్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలియజేశారు.