చైనా దుస్సాహసం

` అరుణాచల్‌ అథ్లెట్లకు నో వీసా
` చైనా చర్యలపై భారత్‌ మండిపాటు
` సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా కవ్వింపు
బీజింగ్‌(జనంసాక్షి):భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు కావాల్సిన అక్రిడిటేషన్‌?ను చైనా నిరాకరించింది. డ్రాగన్‌? అధికారులు అవలంబిస్తున్న ఈ చర్యను భారత్‌? తీవ్రంగా తప్పుబట్టింది. బీజింగ్‌ వివక్షపూరిత చర్యకు నిరసనగా ఆసియా క్రీడల కోసం శనివారం చైనా పర్యటనను భారత్‌? రద్దు చేసుకుంటున్నట్లుగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌? ఠాకూర్‌ వెల్లడిరచారు. నివాస ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా తీరును భారత్‌? తీవ్రంగా ఖండిరచింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘిస్తోందని.. క్రీడా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌? బాగ్చి మండిపడ్డారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని.. ఇందులో భాగంగానే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆసియాక్రీడల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులను లక్ష్యంగా చేసుకొని, ముందే అనుకున్నట్లు, వివక్షపూరితంగా చైనా అధికారయంత్రాంగం వారికి అనుమతులను నిరాకరించినట్లు తమకు సమాచారం అందిందని బాగ్చీ తెలిపారు. తమ దీర్ఘకాల, సుస్థిర విధానానికి కట్టుబడి ఉంటూ నివాసం లేదా జాతుల ఆధారంగా భారత పౌరులను చైనా భిన్నంగా పరిగణించటాన్ని నిర్ధ్వందంగా తిరస్కరిస్తున్నట్లు అరిందమ్‌? బాగ్చి పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ గతంలోనూ, ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో విడదీయరాని భాగమమని ఆయన తేల్చిచెప్పారు. చైనా ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన కొందరు భారత క్రీడాకారులకు అనుమతి నిరాకరించడంపై దిల్లీ.. బీజింగ్‌లో గట్టిగా నిరసన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడిరచింది. సెప్టెంబర్‌? 23 నుంచి హాంగ్‌జౌలో జరగబోయే 19వ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌?కు చెందిన కొందరు అథ్లెట్ల వీసాలను చైనా నిరాకరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చర్య క్రీడల స్ఫూర్తితో పాటు ఆసియా క్రీడల నిర్వహణను నియంత్రించే నియమాలను కూడా ఉల్లంఘిస్తుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అనేది వివాదాస్పద భూభాగం కాదు, భారతదేశంలో విడదీయరాని భాగం. తమపై, తమ భూములపై చైనా పాల్పడుతున్న ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలను ఆ రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ఒలింపిక్‌? కమిటీ జోక్యం చేసుకోవాలి.’’ అని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌? రిజిజు డ్రాగన్‌? దేశంపై మండిపడ్డారు.
అరుణాచల్‌ అథ్లెట్లపై ‘చైనా’ వివక్ష.. దీటుగా స్పందించిన భారత్‌
చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది.దీనిపై తాజాగా భారత్‌ ప్రతిస్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేందుకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు దిగిందని పేర్కొంటూ అధికారికంగా నిరసన తెలియజేసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా పర్యటన కూడా రద్దు చేసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
’చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడల ప్రవేశానికి భారత్‌కు (అరుణాచల్‌ ప్రదేశ్‌) చెందిన కొందరు క్రీడాకారులకు అక్రిడిటేషన్‌ నిరాకరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భారత క్రీడాకారులపై చైనా ఈ తరహా వివక్ష చూపినట్లు తెలుస్తోంది. స్థానికత, వర్గం ఆధారంగా తమ పౌరులను భిన్నంగా చూడటాన్ని భారత్‌ గట్టిగా తిరస్కరిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో భాగమే’ అని భారత విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు.’భారత క్రీడాకారులపై ఇలా ఉద్దేశపూర్వకంగా, ఎంపిక పద్ధతిలో వివక్ష చూపడంపై దిల్లీతోపాటు అటు బీజింగ్‌లోనూ భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది’ అని పేర్కొంటూ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజావార్తలు