చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శలు
జనం సాక్షి, మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో పలు కుటుంబాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సతీమణి మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ ఆదివారం పరామర్శించారు. కన్నాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజియా బేగం భర్త హుస్సేన్ బెగ్ ఇటీవల మరణించిగా వారి కుటుంబాన్ని, కన్నాల ( కొత్తపల్లి) గ్రామంలో గుండేటి గట్టయ్య గుండేటి అరవింద్ ఇటీవల అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పుట్ట శైలజ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే జీ.డి నగర్ గ్రామంలో ఇటీవల మరణించిన మామిడాల వెంకటేశ్ కుటుంబాన్ని, భామ్లా నాయక్ తండా లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఇస్లావత్ వెంకటి కుటుంబాన్ని పరామర్శించిన పుట్ట శైలజ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట కన్నాల సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి , సింగిల్ విండో వైస్ చైర్మెన్ కుడికాల సురేష్ , గ్రామ శాఖ అధ్యక్షుడు ఖాదర్ పాషా, బన్ని తదితరులు ఉన్నారు