చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: విద్యాసాగరరావు

హైదరాబాద్‌: సరిహద్దు ప్రాంతాలనుంచి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠినచర్యలు తీసుకోనంతకాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ అస్సాంలో అల్లర్లను అదుపుచేయటంలో అక్కడి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించటంలో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో 12 వేలమందికి పైగా అక్రమ చొరబాటుదారులు ఉన్నారని అన్నారు.