చౌదరి పురుషోత్తమనాయుడి ఘనత

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా ఐదోసారి ఏకగ్రీవ ఎన్నిక
శ్రీకాకుళం, జూలై 16 : శ్రీకాకుళం పట్టణానికి చెందిన సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి చౌదరి పురుషోత్తమనాయుడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా వరుసగా ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. పన్నెడేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న పురుషోత్తమనాయుడు మరో మూడేళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అతను ఇప్పటికీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది సభ్యుల కమిటీకి 17 నామినేషన్లు దాఖలు కాగా, చివరి నిమిషంలో ఆరుగురు ఉపసంహరించుకోవడంతో కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా చౌదరి పురుషోత్తమనాయుడు, అసోసియేట్‌ అధ్యక్షునిగా ఎం.వి.ఎస్‌.ప్రసాద్‌, బి.కామరాజు, కె.ఫల్గుణరావు, కార్యదర్శిగా పి.వి.రమణ, సంయుక్త కార్యదర్శులుగా పి.వి.రమణమూర్తి, పి.విశ్వనాథం, పి.వి.జె.ఎస్‌.సన్యాసిరావు, కోశాధికారిగా వి.రాధాకృష్ణయాదవ్‌ ఎన్నికయ్యారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు.

తాజావార్తలు