మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్‌

ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్‌ విజన్‌ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని మంత్రి ప్రశ్నించారు.చీకట్లో గుడ్డిగా కాల్పులు జరిపి మైనర్లను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఉప ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాద్యత వహించాలని మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అభిప్రాయపడ్డారు.