ఛార్జీల పెంపు పేద మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలి: ఎం. రాఘవయ్య

హైదరాబాద్‌: ఛార్జీలు పెంచకపోతే భారతీయ రైల్వేకు మనుగడ లేదని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీన్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య అన్నారు. ఛార్జీల పెంపు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. కొందరు స్వార్ధపూరిత నాయకులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తేయాలని, నూతన పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.