జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

చెవెళ్ల: ఈ ఏడాది నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో (ప్రక్టికల్స్‌) జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు బోర్డు ప్రాతీయ పర్యవేక్షణాధికారి బ.ప్రతాప్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతు ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానీన్ని అనుసరించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వీలుపడలేదని, ఈసారి కచ్చితంగా ప్రవేశ పెడతామని స్పష్టంచేశారు. ఫ్రబ్రవరిలో జరిగే ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరుగుతాయని అందుకు విద్యార్థులు, అధ్యాపకులు సన్నద్ధం కావాలని సూచించారు.