జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టీవీ సంస్థలకు జరిమానా
హైదరాబాద్: జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ సంస్థలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూడు సంస్థలకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక్కోదానికి రూ లక్ష చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకు ఖాతాల స్తంభన ఆదేశాలు సవరించాలంటూ ఈ మూడు సంస్థలూ వేర్వేరుగా, పదే పదే పిటిషన్లు దాఖలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అందుకు జరిమానా విధించింది.