జగన్‌కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్‌ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు ఈడీ ఆధికారులు అందజేశారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న జగన్‌ను విచారించడానికి అనుమతించాలంటూ ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ పెట్టుకున్న పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు ఆయనకు  నోటీసులు జారీ చేసింది.