జగన్‌పార్టీ, కాంగ్రెస్‌ ఒక్కటే:సీపీఐ

హైదరాబాద్‌: జగన్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటూ వేయటం ద్వారా కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకటేనని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. జెన్‌కోను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ సంస్థలకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వ విధానాలున్నాయని విమర్శించారు. ప్రభుత్వ మిగులు భూములన్నీ నిరుపేదకు పంచాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.