జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్‌ను నాంపెల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు అధికారులను మందలించింది. ఈనెల 3న అధికారులు సమర్పించిని అనుబంధ చార్జీషీట్‌ను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. చార్జీషీట్‌లో నిందింతులుగా హెటరో, జగతి, అరొబిందో కంపెనీలను పేర్కొని, కంపెనీ ప్రతినిధుల పేర్లను పొందుపరచక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. గతంలోనూ జగన్‌ కేసులో ఎమ్మార్‌, ఓఎంసీలకు సంబంధించి చార్జీషీట్‌ విషయంలో కోర్టుకు ఇలాగే అసంతృప్తి వ్యక్తం చేసింది.