జగన్‌ కోసమే మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు సిఎం

 

హైదరాభాద్‌ : మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బోత్ససత్యనారాయణ పార్టీ అదిష్టానానికి వేర్వేరు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. మజ్లిస్‌ మద్దతు ఉపసంహరణతో రాజకీయం వేడెక్కిన స్థితిలో బోత్స సత్య నారాయణ ఢిల్లీకి బయలుదేరి వేళ్లారు. మజ్లిస్‌ మద్దతు ఉపసంహరణతో పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది. అ ఇద్దరు నేతలను కూడా అంతుపట్టడం లేదని కాంగ్రెసు అంద్రప్రదేశ్‌ వ్యవహరాల ఇంచార్జీ గులాం నబీ అజాద్‌ చెప్పినా దాన్ని ఎవరూ నమ్మడంలేదు. భాగ్యలక్ష్మి దేవాలయం – చార్మినార్‌ సమన్య చుట్టూ అల్లుకుని ఉన్న విషయాలను ముఖ్యమంత్రి తన నివేదికలో పోందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చట్టాన్ని అతిక్రమించలేదని, హైకోర్టు అదేశాలను మాత్రమే అమలు చేశామని అయన చెప్పారు.మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తరుచుగా జైలులో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిశారని వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీతో దోస్తీ కట్టి తన పార్టీని విస్తరించుకోవాలని అసరుద్దీన్‌ అనుకుంటున్నారనిఅయన తన నివేదికలో తెలిపినట్లు చెబుతున్నారు.