జగన్‌ నార్కో పరీక్ష కేసు వాయిదా

హైదరాబాద్‌ : జగన్‌కు సీబీఐ కస్టడీ ముగియటంతో ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ప్రశ్నించినా తమను ప్రయోజనం కలగనందున నార్కో పరీక్షలను అనుమతించాలని సీబీఐ అధికారులు విడిగా వేసిన పిటీషన్‌ను కోర్టు ఈ రోజు విచారించింది. దీని పై తుది విచారణను కోర్టు ఈ నెల 14వ తేదికి వాయిదా వేసింది.