జడేజా పెళ్లిలో కాల్పులు
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహం వివాదంలో చిక్కుకుంది. ఆదివారం పెళ్లి సందర్భంగా వరుడికి కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో వరుడు జడేజాకు సమీపంలో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
ఈ కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ‘ కాల్పులు జరిగినట్టు కంట్రోల్ రూమ్ నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నాం. లైసెన్స్ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది’ అని లోధికా పోలీసు స్టేషన్ పీఎస్సై మహేంద్రసింగ్ రాణా తెలిపారు.
తల్వార్ తిప్పిన వరుడు!
జడేజా ఆదివారం తన ఇష్టసఖి రీవా సోలంకీని పెళ్లాడుతున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లికి తన సన్నిహిత మిత్రులైన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా డ్వేన్ బ్రావోతోపాటు పలువుకు క్రికెటర్లు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సాయంత్రం రాజ్‌కోట్‌లో రిసెప్షన్ జరుగనుంది. పెళ్లి బరాత్‌లో వరుడు జడేజా తల్వార్ తిప్పుతూ హల్‌చల్ చేశాడు. అతడి తల్వార్ డాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.