జడ్పీ చైర్మన్ చిత్రపటానికి పాలాభిషేకం


జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డి.ఎం.ఎఫ్టి నిధుల ద్వారా పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చిత్రపటానికి నాగరం సర్పంచ్ ఇటవేన కొమురమ్మ తో కలిసి గౌడ సంఘం శ్రేణులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మల్యాల కుమార్, ఉపాధ్యక్షులు వడ్లకొండ లక్ష్మణ్, గౌడసంఘం నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కమ్మగోని భాస్కర్ గౌడ్, బత్తిని యాదగిరి గౌడ్, నల్లగొండ శంకరయ్య గౌడ్, బుర్ర రవి గౌడ్, పల్లె లింగయ్య గౌడ్, ఉయ్యాల గంగయ్య గౌడ్, మల్లయ్య గౌడ్, వడ్లకొండ లింగయ్య గౌడ్ లతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ జెడ్పిటిసి మేకల సంపత్ యాదవ్, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెండ్లి నారాయణ, నాగారం బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దీకొండ కొమరయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు నడిగోట్టు సంపత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పంతకానీ రవి, గుర్రం శంకర్, చొప్పరి నారాయణ, పోట్ల శంకర్, అగ్గిమల్ల నర్సయ్య, ఇట్టవేన కొమురయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.